వాషింగ్టన్ : ఉ.కొరియా నేత కిమ్యోంగ్ చోల్ నేతృత్వంలోని అణుచర్చల ప్రతినిధి బృందం అమెరికాతో చర్చల నిమిత్తం గురువారం ఇక్కడికి చేరుకున్నది. చోల్ ఇక్కడ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, ఉ.కొరియాకు అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ బిగన్తో శుక్రవారం భేటీ అవుతారని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ అమెరికన్ మీడియా తన వార్తా కథనాలలో వెల్లడించింది. అయితే ఆయన వైట్‌హౌస్‌ను సందర్శించేదీ లేనిదీ వెల్లడించలేదు. ఉ.కొరియా ప్రతినిధి బృందం అమెరికా అధికారులతో ఈ వారాంతంలో భేటీ అవుతుందని అమెరికా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే ఇందుకు సంబంధించిన వివ రాలేవీ ప్రకటించకపోవటం విశేషం. 'అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధ్యక్షుడు ట్రంప్, ఉ.కొరియా ఛైర్మన్ కిమ్‌జోంగ్ ఉన్‌ల మధ్య సత్సంబంధాలు నెలకొ న్నాయి. ఇరు దేశాల మధ్య తరచు చర్చలు కొనసాగు తాయి' అని వైట్‌హౌస్ ప్రతినిధి ఒకరు వివరించారు. నిర్దేశిత లక్ష్య సాధనలో ముందుకు సాగుతున్నామని, కొరియా ద్వీపకల్పంలో పూర్తి స్థాయి అణు నిరాయుధీ కరణను సాధిస్తామని ఆయన చెప్పారు.