ఆస్ట్రేలియాలో మొదటి గే మ్యారేజ్‌

ఆస్ట్రేలియాలో మొదటి గే మ్యారేజ్‌

 ఆస్ట్రేలియా: అర్ధరాత్రి దాటిందో లేదో, 'ఐ డూ' అని చెప్పేవారిలో ముందుంటూ... క్రెయిగ్‌, లూక్‌.. తమ పెళ్ళి వాగ్దానాలను ఇచ్చి పుచ్చుకున్నారు.ఇక్కడ ఏళ్ళ తరబడి జరిగిన చర్చల్లో అంగీకారం కుదరకపోయినా గతేడాది నిర్వహించిన ఓటింగ్‌ లో గే వివాహాలను చట్టబద్ధం చేశారు.డిసెంబర్‌ లో కొత్త చట్టాన్ని ఆమోదించాకా, జంటలు, తమ పెళ్ళిళ్ళ కోసం 30 రోజుల అధికారిక నోటీస్‌ ఇవ్వడం మొదలుపెట్టారు.అంతకంటే ముందే పెళ్ళి చేసుకునేందుకు కూడా కొన్ని జంటలకు మినహాయింపు ఇచ్చారు.అయితే.. కైలీ, లీసాల జంటకు చట్టబద్ధంగా ఒక్కటయ్యేందుకు ఇప్పుడు అవకాశం దక్కింది. వారి కుమార్తె ఇస్లా పెళ్ళిలో సందడి చేసింది. 

అయితే వివాహానికి కొత్త నిర్వచనాలను అంగీకరించబోమని అనే వాళ్ళూ ఉన్నారు.మూడోవంతుకు పైగా ఓటర్లు చట్టంలో మార్పునకు అంగీకరించలేదు. జెండర్‌, సెక్స్‌ ఎడ్యుకేషన్‌ లపై స్కూళ్ళలో చేసే బోధనలో మార్పులు వస్తాయని కొన్ని మతపరమైన సంస్ధలు అంటున్నాయి. అయితే చట్టం ద అష్టిలో సమానత్వం కోసం ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూసిన జంటలు మాత్రం తమ పెళ్ళి రోజు నుంచి ద అష్టి మళ్ళించడానికి ఏమాత్రం సిద్ధంగా లేరు.