బ్రెగ్జిట్‌పై మరో రిఫరెండం

బ్రెగ్జిట్‌పై మరో రిఫరెండం

 బ్రిటన్‌ : బ్రెగ్జిట్‌పై నిర్ణయాధికారాన్ని ప్రధాని ధెరిస్సా మే చేతుల నుండి తీసుకునేందుకు ప్రతిపక్ష లేబర్‌ పార్టీ నేత మరో రిఫరెండం చేపట్టాలని పార్లమెంట్‌లో ప్రకటించారు. యూరోపియన్‌ యూనియన్‌ నుండి విడిపోయేందుకు థెరిస్సా చేసుకున్న ఒప్పందంపై గత వారంలో జరిగిన ఓటింగ్‌లో 432-202 శాసన సభ్యులు తిరస్కరించారు. దీనిని ఆధునిక బ్రిటన్‌ చరిత్రలోనే పెద్ద ఓటమిగా విశ్లేషకులు అభివర్ణించారు. యూరోపియన్‌ యూనియన్‌ నుండి బయటకు వచ్చేందుకు చేసుకున్న ఒప్పందంపై ఓటింగ్‌ నిర్వహించే అంశాన్ని పరిశీలించేందుకు గాను పార్లమెంట్‌కు సమయమివ్వాలని కోరుతూ ప్రతిపక్ష లేబర్‌ పార్టీ సవరణను ప్రవేశపెట్టింది.