కార్గో నౌకతో అమెరికా యుద్ధ నౌక ఢీ

కార్గో నౌకతో అమెరికా యుద్ధ నౌక ఢీ

 వాషింగ్టన్‌: అమెరికా నేవికి చెందిన యుద్ధనౌక ఒకటి జపాన్‌ సముద్ర తీరంలో ఓ కార్గో నౌకను ఢీకొట్టింది. ఈ ఘటనలో కొంతమంది అమెరికా నేవీ సిబ్బందితోపాటు కార్గో సిబ్బంది కూడా స్వల్పంగా గాయపడినట్లు తెలుస్తోంది. శనివారం ఉదయం వేకువ జామున 2.30 గంటల 3.00గంటల మధ్య ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

   జపాన్‌లోని యోకోసుఖాకు 56 నాటికల్‌ మైళ్ల దూరంలో అమెరికాకు చెందిన ఫిట్జరాల్డ్‌ అనే ఓ క్షిపణి విధ్వంసక నౌక, పిలిప్పీన్స్‌ జెండాను కలిగిన ఏసీఎక్స్‌ క్రిస్టల్‌ అనే కార్గో నౌక సరిగ్గా 2.30గంటల ప్రాంతంలో అతి సమీపంగా వచ్చాయని ఆ సమాయంలోనే ఒకదానికి ఒకటి ఢీకొట్టుకున్నట్లు అమెరికాకు చెందిన ఏడో నేవీ దళం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రమాదానికి గల కారణాలు పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అమెరికా యుద్ద నౌకలో దాదాపు 330మంది సిబ్బంది ఉన్నారు. ఈ ప్రమాదం వల్ల ఓ చోట రంధ్రం ఏర్పడి నీరు లోపలికి వస్తుందని, దాన్ని తాము నియంత్రించగలమని చెప్పారు.