కాంగో అధ్యక్షుడుగా ఫెలిక్స్‌ సిసెకెడి

కాంగో అధ్యక్షుడుగా ఫెలిక్స్‌ సిసెకెడి

 కిన్షాసా: డెమొక్రాటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో అధ్యక్ష ఎన్నికల్లో ఫెలిక్స్‌ సిసెకెడిని ఆ దేశ రాజ్యాంగ న్యాయస్థానం విజేతగా ప్రకటించింది. అధ్యక్ష ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడిందంటూ ప్రతిపక్ష నేత మార్టిన్‌ ఫయలు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసిన న్యాయస్థానం త్షిసెకెడి 60 శాతానికి పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్లు తన తీర్పులో స్పష్టం చేసింది. ఈ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన ఫయలు ప్రస్తుత అధ్యక్షుడు జోసెఫ్‌ కబిలా సిసెకెడి మధ్య మోసపూరితంగా కుదిరిన రహస్య ఒప్పందం ఫలితంగానే ఈ ఫలితాలు వెలువడ్డాయని తన పిటిషన్‌లో ఆరోపించారు. అయితే ఈ వాదనను తిరస్కరించిన న్యాయస్థానం దేశ కొత్త అధ్యక్షుడిగా సిసెకెడి ఎన్నికయినట్లు అధికారికంగా ప్రకటించింది.