దక్షిణ కొరియా వింటర్ ఒలింపిక్స్‌కు కిమ్ సోదరి

దక్షిణ కొరియా వింటర్ ఒలింపిక్స్‌కు కిమ్ సోదరి

  సియోల్: దక్షిణ కొరియాలో జరిగే శీతాకాల ఒలింపిక్స్‌లో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సోదరి పాల్గొననున్నారు. పలు చర్చల అనంతరం ఉత్తర కొరియా తమ క్రీడాకారులను శీతాకాల ఒలింపిక్స్‌కు పంపేందుకు అంగీకరించింది. ఈ నేపథ్యంలో కిమ్ జోంగ్ సోదరి యో జోంగ్ ఈ వారంలో దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. కిమ్ కుటుంబసభ్యులు ఒకరు ఇలా దక్షిణ కొరియాలో పర్యటించడం ఇదే తొలిసారి. దక్షిణ కొరియా ప్యాంగ్‌చాంగ్ నగరంలో శుక్రవారం నుంచి శీతాకాల ఒలింపిక్స్ మొదలవనున్నాయి. ప్రారంభకార్యక్రమంలో ఇరుదేశాలు ఒకే జెండా కింద పాల్గొననుండటం విశేషం. ఇప్పటికే 280 మందితో కూడిన ఉత్తర కొరియా ఆటగాళ్ల బృందం దక్షిణ కొరియా చేరుకుంది. తన పర్యటనలో భాగంగా దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్‌తో యో జోంగ్ భేటీ అయ్యే అవకాశాలున్నాయి.