దీపావళికి యూఎన్‌ ప్రత్యేక కానుక

దీపావళికి యూఎన్‌ ప్రత్యేక కానుక

  న్యూయార్క్‌ : దీపావళి సందర్భంగా భారతీయులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఐక్యరాజ్యసమితి రెండు స్టాంపులను విడుదల చేసింది. ‘హ్యాపీ దీవాళి. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా భారతీయులు జరుపుకొనే వెలుగుల పండుగ సందర్భంగా యూన్‌ స్టాంప్స్‌’  అంటూ ట్వీట్‌ చేసింది. శుభాకాంక్షలతో పాటు హ్యాపీ దీవాళి అనే అక్షరాలతో కూడిన లైటింగ్‌లో ఉన్న ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం, దీపాలతో కూడిన స్టాంపు షీటు ఫొటోను తన అధికారిక ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది.1.15 డాలర్ల విలువైన ఈ స్టాంపులను అంతర్జాతీయ ఎయిర్‌మేల్‌ లెటర్లకు ఉపయోగించుకోవచ్చు.