ఎడారిముప్పు , కరువుపై పోరుకు

ఎడారిముప్పు , కరువుపై పోరుకు

 ఐక్యరాజ్యసమితి : ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో విస్తరిస్తున్న ఎడారిముప్పు, పెరుగుతు న్న కరువు పరిస్తితులపై పోరుకు ప్రాధాన్యతనివ్వా లని ఐక్యరాజ్యసమితి అంత ర్జాతీయ సమాజానికి పిలు పు నిచ్చింది. మానవాళిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్న కరువు పరిస్థితులకు దారి తీస్తున్న ఎడారిముప్పుపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ఏటా జూన్‌ 17వ తేదీని ఎడారిముప్పు, కరువు వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవంగా పాటించాలని ఐరాస నిర్ణయించిన విషయం తెలిసిందే. ఎడారిముప్పుకు వ్యతిరేకంగా 194 సభ్యదేశాలతో కూడిన ఐరాస విభాగం 1994 ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 

ముఖ్యంగా మానవ కార్యకలాపాలు, వాతావరణ మార్పుల కారణంగా ఏర్పడుతున్న నిర్జల ప్రాంతాలు, భూమి పొరల్లో చోటు చేసుకుంటున్న మార్పులే ఎడారిముప్పు విస్తరణకు కారణమని ఐరాస ప్రకటించింది. ప్రపంచంలో దాదాపు మూడో వంతుకు పైగా వున్న మెట్ట భూముల్లో పరిమితికి మించి కొనసాగుతున్న సాగు, భూముల దుర్వినియోగం వంటి వాటితో పాటు పెరుగుతున్న పేదరికం, రాజకీయ అస్థిరత, అటవీ ప్రాంతాల నిర్మూలన, ఎండిపోతున్న సాగునీటి వ్యవస్థల వంటివి భూసారాన్ని దెబ్బతీస్తున్నాయని ఐరాస తన ప్రకటనలో వివరించింది.

నానాటికీ పెరుగుతున్న ఎడారిముప్పుతో దాదాపు 25 కోట్ల మందికి పైగా ప్రజలు నేరుగా ప్రభావితులవుతుండగా దాదాపు 100కు పైగా దేశాలలో నివశిస్తున్న దాదాపు 100 కోట్ల మంది ప్రజలు (ప్రపంచ జనాభాలో 15శాతం) ప్రమాదపుటంచుల్లో జీవనం వెళ్లదీస్తున్నారని వెల్లడించింది.