ఎస్తోనియాలో సైనిక విన్యాసాలు

ఎస్తోనియాలో సైనిక విన్యాసాలు

 టాలిన్‌ : ఎస్తోనియాలో సిల్‌ 2018 పేరుతో పెద్ద ఎత్తున సైనిక విన్యాసాలు  జరుగుతున్నాయి. 12కిపైగా దేశాల నుండి 15వేలకు పైగా బలగాలు ఈ విన్యాసాల్లో పాల్గొంటున్నాయి.. ఈ విన్యాసాల కోసం ఎస్తోనియా తన జనాభాలో ఒక శాతాన్ని సమీకరించింది. ఎస్తోనియా ఆధునిక చరిత్రలో ఇదే అతిపెద్ద విన్యాసాలుగా భావిస్తున్నారు. దేశ సైనిక బలగాల్లో మెజారిటీ భాగం ఈ విన్యాసాల్లో పాల్గన్నాయి. బుధవారం ప్రారంభమైన ఈ కార్యక్రమం వచ్చే ఆదివారం వరకు కొనసాగుతుంది. రెగ్యులర్‌గా పాల్గనే రిజర్వ్‌ మిలటరీ సర్వీస్‌ మెంబర్స్‌తో పాటు పేరా మిలటరీ డిఫెన్స్‌ లీగ్‌, వుమెన్స్‌ హోం, డిఫెన్స్‌ ఆర్గనైజేషన్‌, పోలీసు, సహాయక సిబ్బంది మొత్తంగా 13వేల మంది సిల్‌ా2018లో పాల్గన్నారు. ఎస్తోనియా మొత్తం జనాభా కేవలం 13లక్షలు మాత్రమే. ఈ విన్యాసాలు చూసేందుకు రష్యా, బెలారస్‌ల నుండి పరిశీలకులు వచ్చారు. అమెరికా, బ్రిటన్‌, డెన్మార్క్‌, జర్మనీ, పోలెండ్‌, ఫ్రాన్స్‌, లాత్వియా, లిథుయేనియా, బెల్జియం, కెనడా తదితర దేశాల నుండి 2వేల మంది సైనికులు పాల్గొంటున్నారు.