ఫ్రాన్స్ హోటల్లో భారీ దోపిడీ

ఫ్రాన్స్ హోటల్లో భారీ దోపిడీ

 పారిస్ : ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని వెందోమ్ అనే లగ్జరీ హోటల్‌లో ప్రదర్శనకు ఉంచిన నగలను సాయుధలైన దుండగులు దోచుకెళ్లారు. వెందోమ్ హోటల్లో ప్రపంచంలోని వివిధ నగల వ్యాపారులు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తుంటారు. గురువారం సాయం త్రం 6.30 గంటలకు ఐదుగురు గొడ్డళ్లతో సహా హోటళ్లోకి ప్రవేశించారు. ఆ తర్వాత హోటల్లో ఉన్న అద్దాలను గొడ్డలితో పగులగొట్టి ఆభరణాలను దోచుకెళ్లారు. వీరిలో ముగ్గురు అనుమానితులను పట్టుకున్నామని.. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్టు పారిస్ పోలీసులు తెలిపారు. నగల విలువ కొన్ని కోట్లలో ఉంటుందని అధికారులు చెప్పారు. దోపిడీ తర్వాత హోటల్‌ను మూసివేసినట్టు ఫ్రాన్స్ అంతర్గత మంత్రి గెరాడ్ కోలాంబ్ తెలిపారు. ఈ ఘటన జరిగిన తర్వాత హోటల్ వెనుకభాగంలో ఓ బైక్ స్పీడ్‌గా వెళ్లినట్టు ఓ ఉద్యోగి వివరించారు.