ఫ్రాన్స్‌లో వెల్లువెత్తిన నిరసనలు

ఫ్రాన్స్‌లో వెల్లువెత్తిన నిరసనలు

 పారిస్‌ : కార్మిక చట్టాల్లో సంస్కరణల పేరుతో ఫ్రాన్స్‌ ప్రభుత్వం చేపడుతున్న కార్మిక వ్యతిరేక చర్యలను నిరసిస్తూ మంగళవారం దేశవ్యాప్తంగా పలు నగరాల్లో వేలాదిమంది కార్మికులు ప్రదర్శనలు నిర్వహించారు. సోమరిపోతులకు చోటు వుండదంటూ మాక్రాన్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శిస్తూ పారిస్‌లో కొంతమంది ప్లకార్డులు చేబూని ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ''మీరు చేపట్టిన చర్యలతో వీధిన పడ్డాం'' అంటూ వారు నినదించారు. దాదాపు రెండున్నర లక్షలమంది కార్మికులు ప్రదర్శనలో పాల్గొన్నట్లు హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. కమ్యూనిస్టు పార్టీకి చెందిన సిజిటి యూనియన్‌ నేతృత్వంలో జ్రరిగిన పదర్శన సందర్భంగా కార్మికులతో పోలీసులు ఘర్షణ పడ్డారు. 

కాగా నాలుగు లక్షల మంది కార్మికులు పాల్గొన్నట్లు కార్మిక సంఘాలు తెలిపాయి. ఫ్రాన్స్‌ కార్మిక నిబంధనావళిని బలహీనపరచడానికి గతంలో జరిగిన ప్రయత్నాలను కార్మిక సంఘాలు తీవ్రంగా అడ్డుకు న్నాయి. అయితే ఈసారి రెండు కార్మిక సంఘాలు నిరసనల్లో చేతులు కలపలేదు. వారాల తరబడి చర్చలు కొనసాగిన తర్వాత ప్రభుత్వం గత వారం కొన్ని చర్యలు తీసుకుంది. కార్మి కులను తమ చిత్తం వచ్చినట్లు తీసుకోవడానికి, తొలగించ డానికి కంపెనీలకు మరింత స్వేచ్ఛ కల్పిస్తూ నిర్ణయం తీసు కుంది. వారానికి 35గంటల పని గురించి ఈ సంస్కరణల్లో ఎలాంటి ప్రత్యక్ష ప్రస్తావన లేదు. వేతనాలు, పని పరిస్థితులపై నిర్ణయాల్లో కంపెనీలకు మరింత వెసులుబాటును కల్పిం చింది. ఈ నెల 22న డిక్రీ జారీ చేయడం ద్వారా ఈ కొత్త చర్య లను ఆమోదించాలని ప్రభుత్వం భావిస్తోంది. సోమరిపోతు లంటూ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు నిరుద్యోగులపై దాడేనని కొన్ని కార్మిక సంఘాలు విమర్శించాయి.