గాజాలో వైమానిక దాడులకు తెగబడిన ఇజ్రాయిల్‌

గాజాలో వైమానిక దాడులకు తెగబడిన ఇజ్రాయిల్‌

  జెరూసలేం : గాజావ్యాప్తంగా 12చోట్ల ఇజ్రాయిల్‌ బుధవారం పెద్ద ఎత్తున వైమానిక దాడులకు పాల్పడింది. ఆ లక్ష్యాలన్నీ హమస్‌ తీవ్రవాద కేంద్రాలని సైనిక ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. గాజా నుండి దాదాపు 36 రాకెట్లను ఇజ్రాయిల్‌పై ప్రయోగించారని, వాటికి ప్రతిగా ఈ దాడులు నిర్వహించినట్లు ఆ ప్రకటన తెలిపింది. దక్షిణాది నగరమైన సెడరాట్‌పై ఎనిమిది రాకెట్లు పడ్డాయని, ఆరుగురు గాయపడ్డారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. రాత్రంతా దక్షిణ ఇజ్రాయిల్‌లో సైరన్లు మోగుతునే వున్నాయని, మరిన్ని దాడులు జరిగే అవకాశం వుందని, ప్రజలు ఇళ్ళల్లోనే వుండాల్సిందిగా హెచ్చరికలు వెలువడ్డాయి. మంగళవారం ఇజ్రాయిల్‌ శతఘ్ని దాడిలో గాజాలో ఇద్దరు హమస్‌ కార్యకర్తలు మృతి చెందారు.