గాజాపై ఇజ్రాయిల్‌ భీకర దాడులు

గాజాపై ఇజ్రాయిల్‌ భీకర దాడులు

  జెరూసలేం : నాజీలను తలపిస్తున్న ఇజ్రాయిల్‌లోని యూదు దురహంకారి నెతన్యాహు గాజాపై మరో సారి అత్యంత భయానకమైన వైమానిక దాడులకు దిగారు. గాజాలో 140 ప్రదేశాలపై అధునాతన జెట్‌ యుద్ధవిమానాలు బాంబుల వర్షం కురిపించాయి. ఈ కిరాతక దాడుల్లో నిండు గర్భిణి, పద్దెనిమిది మాసాల బాలుడితో సహా ముగ్గురు పాలస్తీనియన్లు మరణించారు. మరో అర డజను మందికి పైగా గాయపడ్డారు. ఒక వైపు హమాస్‌తో చర్చలు సాగిస్తూనే మరో వైపు వారిని భౌతికంగా అంతమొందించేందుకు దుర్మార్గమైన చర్యలకు పూనుకుంది. తాము దాడులు జరిపిన ప్రదేశాలన్నీ హమాస్‌ స్థావరాలేనని నెతన్యాహు ప్రభుత్వం సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నది.

గాజా వైపు నుండి దాదాపు 150 రాకెట్లు ప్రయోగిం చడంతో గాజా ప్రాంతం దద్దరిల్లింది. గాజాను పూర్తిగా కబళించే పథకంలో భాగంగానే ఇజ్రాయిల్‌ ఈ దాడులకు తెగబడినట్లు హమాస్‌ పేర్కొంది. ఇజ్రాయిల్‌ భారీగానే మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుందని అది హెచ్చరిం చింది. గాజా సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయించే ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్లు ఇజ్రాయిల్‌ మీడియా తెలిపింది. ఇజ్రాయిల్‌ దక్షిణాది నగరమైన సెడరాట్‌పై ఎనిమిది రాకెట్లతో ఇజ్రాయిల్‌ జరిపిన దాడిలో పలువురు గాయపడ్డారు.. బుధవారం రాత్రంతా సైరన్లు మోగుతూనే వున్నాయి. మరిన్ని దాడులు జరిగే అవకాశం వుందని, ప్రజలు ఇళ్ళల్లోనే వుండాల్సిందిగా హెచ్చరికలు వెలువడ్డాయి.

ఇజ్రాయిల్‌ గాజా మధ్య ఉద్రిక్తతలను తొలగించాలని ఈజిప్టులోని ఐరాస రాయబారి విజ్ఞప్తి చేశారు. దాడులు ఆపి చర్చలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు ఇజ్రాయిల్‌ మంత్రి యువాల్‌ మాట్లాడుతూ, యుద్ధం జరపాలనే తామేమీ ఉత్సాహ పడడం లేదని, విస్తృత స్థాయిలో ఘర్షణలు కూడా కోరుకోవడం లేదన్నారు. అయితే అదే సమయంలో హమస్‌కి ఎలాంటి రాయితీలు ఇవ్వాలని కూడా అనుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. 

ఇజ్రాయిల్‌ దూకుడు కొనసాగుతున్న నేపథ్యంలో హమస్‌ ప్రతినిధి మాట్లాడుతూ, ఈ దాడులను ప్రతిఘటిం చాల్సిన కర్తవ్యం మాకుందని, ఆత్మ రక్షణ కోసం పోరు కొనసాగిస్తామని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. గాజాపై దారుణం గా దాడులు జరపడం, ఉద్దేశ్యపూర్వకంగా ప్రజలను లక్ష్యా లుగా చేసుకోవడం చూస్తుంటే వారు పాల్పడుతున్న ఈ నేరా లకు కచ్చితంగా మూల్యం చెల్లించాల్సి వుంటుందని హెచ్చ రించారు. బుధవారం గాజా సరిహద్దుల్లో మరింత అప్రమత్త తను పెంచుతూ ఇజ్రాయిల్‌ సైన్యం చర్యలు తీసుకుంది. ఇజ్రాయిల్‌ ప్రజలు, బలగాలపై ఎలాంటి దాడి చేసినా సహించేది లేదని సైన్యం హమస్‌ను హెచ్చరించింది. తీవ్ర పర్యవసానాలు ఎదుర్కొనడానికి సిద్ధంగా వుండాలని పేర్కొంది. ఇరు పక్షాల మధ్య చెలరేగిన హింసలో ఇప్పటివరకు 140మంది పాలస్తీనియన్లు మరణించారు.