ఐసిస్‌ మిలిటెంట్లను తరిమికొట్టిన సిరియా సైన్యం

ఐసిస్‌ మిలిటెంట్లను తరిమికొట్టిన సిరియా సైన్యం

  డెమాస్కస్‌: తన మిత్ర దేశాల సేనల సహకారంతో ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన మిలిటెంట్లను తరిమికొట్టి వారి ఆధీనంలో వున్న దాదాపు 12 వేల చ.కి.మీ ప్రాంతాన్ని స్వాధీనం సిరియా సైన్యం చేసుకున్నదని సిరియా రక్షణ మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. డెమాస్కస్‌ నైరుతి ప్రాంతంలోని వ్యూహాత్మక ప్రదేశాలను, పర్వత ప్రాంతాలను తన ఆధీనంలోకి తీసుకోవటం ద్వారా సిరియా సైన్యం ఈ విజయం సాధించిందని సిరియా రక్షణ శాఖ పేర్కొంది. 

ఈ తాజా విజయంతో ఐసిస్‌ మిలిటెంట్లకు మద్దతుగా అమెరికా దళాలు తిష్ట వేసిన అల్‌ తాన్ఫ్‌ సైనిక స్థావరానికి కేవలం 55 కి.మీ దూరంలో సిరియా సైన్యాలు వున్నాయని,. సిరియా సైన్యం పల్మైరా, వీర్‌ ఎజర్‌ మధ్య వున్న వ్యూహాత్మక మార్గాన్ని సిరియా సైన్యం పూర్తిగా స్వాధీనం చేసుకుందని డీర్‌ ఎజర్‌లోని సైనిక కమాండర్‌ మేజర్‌ జనరల్‌ మహ్మద్‌ ఖాదర్‌ వేరొక ప్రకటనలో వివరించారు. పౌరులు ఈ మార్గాన్ని నిర్భయంగా వినియోగించుకోవచ్చన్నారు. 

కాగా, సిరియా సైన్యంపై దొంగ దెబ్బకు ఐసిస్‌ను అమెరికా ఉసిగొల్పుతోందని రష్యా ధ్వజమెత్తింది. సిరియా సైన్యంపై దొంగచాటుగా దెబ్బతీయడానికి వందలాదిమంది ఐసిస్‌ తీవ్రవాదులు గత వారం ఎలా సిద్ధమయారో అమె రికా వివరణ ఇవ్వాలని రష్యా డిమాండ్‌ చేసింది. రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మేజర్‌ జనరల్‌ ఇగర్‌ కొనషెంకొవ్‌ మాట్లాడుతూ, దక్షిణ ఉద్రిక్త నివారణ మండలంలో కాల్పుల విరమణ ఒప్పందం సంక్షోభంలో పడిందని అన్నారు.