కాబూల్‌పై పట్టుకు తాలిబన్ల విఫలయత్నం

కాబూల్‌పై పట్టుకు తాలిబన్ల విఫలయత్నం

 కాబూల్‌ : ఆఫ్ఘన్‌ రాజధాని నగరంపై పట్టు సాధించేందుకు తాలిబన్లు విఫలయత్నం చేశారు. ఇళ్ళల్లో దాక్కుని, రాత్రవగానే వీధుల్లోకి వచ్చి తాలిబన్లు భద్రతా బలగాలపై దాడులు జరిపారు. 14మంది పోలీసులను హతమార్చారని అధికారులు తెలిపారు. ఘాజ్ని నగరంలో రాత్రి జరిగిన దాడుల్లో 20మంది గాయపడ్డారని ఘాజ్నీ నగర ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్‌ మహ్మద్‌ హేమత్‌ తెలిపారు. పశ్చిమ హెరాత్‌ ప్రావిన్స్‌లో గత రాత్రి మరో దాడి జరిగింది. ఈ దాడిలో ఆరుగురు పోలీసులు మరణించారని గవర్నర్‌ ప్రతినిధి తెలిపారు. కాల్పులు విరమణ ఒప్పందం కుదుర్చుకుని, చర్చలకు రావాల్సిందిగా ప్రభుత్వం ప్రతిపాదించినప్పటికీ వాటిని తోసిపుచ్చి హింసకు, దాడులకు తాలిబన్‌ తెగబడుతోంది. ఘాజ్నీలో తెల్లవారుజామున రెండు గంటలకు దాడి జరిగింది. సుదీర్ఘంగా సాగిన ఉధృత పోరులో నగరంలోని అనేక దుకాణాలు దగ్ధమయ్యాయని ప్రావిన్షియల్‌ పోలీసు చీఫ్‌ ఫరీద్‌ అహ్మద్‌ తెలిపారు. తీవ్రవాదుల దాడిని విజయవంతంగా తిప్పికొట్టిన పోలీసులు తర్వాత ప్రతీ ఇల్లు సోదా చేసి తీవ్రవాదులు ఎక్కడైనా దాక్కుని వున్నారమోనని గాలించారు. అసలు నగరంలోకి ఇంతలా ఎలా చొచ్చుకు వచ్చారనే అంశంపై దర్యాప్తు కూడా ప్రారంభమైంది.