కిండర్‌ గార్డెన్‌లో పేలుడు: ఏడుగురి మృతి

కిండర్‌ గార్డెన్‌లో పేలుడు: ఏడుగురి మృతి

 బీజింగ్‌: చైనాలో ఘోరం చోటుచేసుకుంది. ఓ నర్సరీ పాఠశాల (కిండర్‌ గార్డెన్‌) వద్ద జరిగిన పేలుడులో ఏడుగురు విద్యార్థులు మృతిచెందగా.. సుమారు 60 మంది గాయపడ్డారు. తూర్పు చైనాలోని జియాంగ్సు ఫ్రావిన్స్‌ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. జియాంగ్సు ఫ్రావిన్స్‌లోని ఫెంగ్జియాన్‌ కౌంటీలో సాయంత్రం 4.50గంటలకు పాఠశాల విడిచిపెట్టిన అనంతరం చిన్నారులు వస్తుండగా గేటు వద్ద పేలుడు సంభవించింది. 

అయితే పేలుడుకు గల కారణమేంటనే విషయం తెలియాల్సి ఉందని, దీనిపై విచారణ కొనసాగుతోందని ఓ పోలీసు ఉన్నతాధికారి చెప్పారు. చిన్నారులు నేలపై పడి ఉన్న ఫొటోలను కొంతమంది సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. అయితే ఈ దాడికి ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? అనే దానిపై పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పాఠశాల సమయం ముగియడంతో చిన్నారులను తీసుకెళ్లేందుకు వారి తల్లిదండ్రులు పాఠశాల వద్దకు వచ్చారు. వారిని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగి ఉంటుందని కొంతమంది అధికారులు భావిస్తున్నారు.