లస్సా ఫీవర్‌తో 142 మంది మృతి

లస్సా ఫీవర్‌తో 142 మంది మృతి

  లాగోస్: లస్సా ఫీవర్ బారిన పడి నైజీరియాలో 142 మంది ప్రాణాలు కోల్పోయారు. 2018 ప్రారంభం నుంచి ఇప్పటివరకు 142 మరణాలు నమోదయ్యాయని నైజీరియా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సీడీసీ) ఓ ప్రకటనలో వెల్లడించింది. మొత్తం 36 రాష్ర్టాలకు 20 రాష్ర్టాల్లో లస్సా ఫీవర్ కేసులు నమోదయ్యాయని, మార్చి 6 వరకు 18 రాష్ర్టాల్లో 110 కేసులు నమోదయినట్లు ఎన్‌సీడీసీ తెలిపింది. నైజీరియాలో దక్షిణాది రాష్ర్టాలైన ఇడో, ఒండో, ఎబొనియి రాష్ర్టాల్లో లస్సా ఫీవర్ ప్రభావం అధికంగా ఉందని పేర్కొంది. ప్రమాదకర ఎబోలా వైరస్ మాదిరిగానే లస్సా వైరల్ ఫీవర్ లక్షణాలుంటాయని, వాంతులు, రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తాయని అధికారులు తెలిపారు. ఎలుకల మలం లేదా మూత్రం అంటుకుని ఉన్న పాత్రల్లో ఉన్న ఆహారం ద్వారా ఈ వైరస్ సోకే అవకాశముందని తెలిపారు. 1969లో ఉత్తరనైజీరియాలో లస్సా అనే పట్టణంలో మొదటి కేసు నమోదైంది. అప్పటి నుంచి దీనిని లస్సాఫీవర్‌గా పరిగణిస్తున్నారు.