>

లండన్ మృతులు 17 మంది

లండన్ మృతులు 17 మంది

 లండన్: లండన్‌లో జరిగిన గ్రెన్‌ఫెల్ టవర్ అగ్నిప్రమాదంలో మృతులు సంఖ్య 17కు చేరుకున్నది. గురువారం మంటలు పూర్తిగా ఆరిపోయినప్పటికీ భవనంలో నుంచి ఇంకా పొగలు వస్తున్నాయి. లోపల ఎవరూ సజీవంగా ఉండే అవకాశమే లేదని అగ్నిమాపకదళం అధికారులు అంటున్నారు. మాడిమసైపోయిన భవనం నుంచి ఓ పెద్ద శకలం కిందకు జారిపడింది. భవనంలో తనిఖీలు జరిపితే మృతుల సంఖ్య మరింతగా పెరుగొచ్చని అంటున్నారు. 

గ్లెన్‌ఫెల్ టవర్ అగ్నిప్రమాదానికి ఉగ్రవాదంతో ఎలాంటి సంబంధం లేదని ఫైర్ సర్వీస్ చీఫ్ డేనీ కాటన్ అన్నారు. ప్రధాని థెరెసామే గురువారం ఉదయం అగ్నిప్రమాదం జరిగిన భవనాన్ని సందర్శించారు. ప్రమాద ఘటనపై ఉన్నతస్థాయివిచారణకు ఆమె దేశించారు. అగ్నిప్రమాదంలో అనేకమంది ప్రాణాలు కోల్పోవడం పట్ల బ్రిటిష్ రాణి ఎలిజబెత్ సంతాపం వ్యక్తం చేశారు. 


Loading...