మదురో ప్రభుత్వ కూల్చివేతకు కుట్ర

మదురో ప్రభుత్వ కూల్చివేతకు కుట్ర

   వాషింగ్టన్‌ : మదురో ప్రభుత్వాన్ని కూలదోసేం దుకు రకరకాల కుట్రలు పన్నుతున్న అమెరికా తాజాగా మరో కుట్రకు పాల్పడింది. ట్రంప్‌ ప్రభుత్వ ఉన్నతాధికారులు కొందరు వెనిజులా సాయుధ బలగాల్లోని మాజీ అధికారులతో రహస్య మంత నాలు జరిపినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ శనివారం బయటపెట్టింది. మదురరో ప్రభుత్వాన్ని పడగొట్టేం దుకు ఓ డజను మంది వెనిజులా తిరుగుబాటు మిలిటరీ అధికారులతో ట్రంప్‌ అధికారులు మంత నాలు జరిపారని అమెరికా, వెనిజులా అధికార వర్గాలనుటంకిస్తూ టైమ్స్‌ తెలియజేసింది. 2017 వేసవిలోను, ఈ ఏడాది మార్చి, మే మాసాల్లోను రహస్య మంతనాలు సాగాయి. 

అయితే ఆ పన్నాగాలన్నీ విఫలమయ్యాయి. వెనిజులాలో సైనిక చర్య అవకాశాన్ని తోసిపుచ్చలేమని గతేడాది ఆగస్టులో ట్రంప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. వెనిజులా తిరుగుబాటు సైనికాధికారులను ట్రంప్‌ ప్రభుత్వ అధికారులు కలిసి దాడి జరిపే అవకాశంపై చర్చించినట్లు ఆ వార్తా కథనం తెలిపింది. అమెరికా మాజీ విదేశాంగ మంత్రి రెక్స్‌ టిల్లర్‌సన్‌, జాతీయ భద్రతా మాజీ సలహాదారు మెక్‌మాస్టర్‌ కూడా వీరితో రహస్యంగా సమావేశమైనట్లు టైమ్స్‌ పేర్కొంది. ఈ సమావేశం ఒక యూరపు దేశంలోని అమెరికా ఎంబసీలో జరిగినట్లు తెలుస్తోంది.

ఆ సమావేశానికి వచ్చిన వెనిజులన్లు ఎలాంటి ప్రణాళికలు లేకుండా వచ్చారని, అమెరికానే అటు వంటి ప్రణాళికలు తమకు అందచేయగలదని వారు భావించారని సంబంధిత వర్గా లు తెలిపాయి. అయితే ఈ వ్యక్తులు పకడ్బందీగా ఏదైనా చేయగలరనే విశ్వాసం ట్రంప్‌ ప్రభుత్వానికి కలగలేదని అదే రోజు వాషింగ్టన్‌ పోస్ట్‌లో ప్రచురితమైన మరో కథనం పేర్కొంది. అసలు వారు ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తున్నారో కూడా స్పష్టం కాలేదని తెలిపింది. వెనిజులా అంతర్గత వ్యవహారాల్లో అమెరికా ప్రభుత్వ సైనిక కుట్రలు, జోక్యం దీని ద్వారా ప్రపంచానికి మరోసారి వెల్లడైందని వెనిజులా విదే శాంగ మంత్రి జోర్గే అరేజా పేర్కొన్నారు. వెనిజులా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమెరికా పన్నిన కుట్రలను బొలీవియా అధ్యక్షుడు ఎవో మొరేల్స్‌ ఖండించారు.