మారిన ఉత్తర కొరియా టైమ్‌

మారిన ఉత్తర కొరియా టైమ్‌

 ప్యాంగాంగ్‌ : దక్షిణ కొరియా టైమ్‌ జోన్‌కు అనుకూలంగా ఉత్తర కొరియా శనివారం నుండి తన టైమ్‌ జోన్‌ను సవరించింది. ఉత్తర కొరియా గడియారాలన్నింటినీ 30 నిముషాలు ముందుకు తిప్పారు. 2015 నుండి అమలు చేసిన 'ప్యాంగాంగ్‌ టైమ్‌' ఇక వుండదని ప్రకటించారు. సుప్రీం పీపుల్స్‌ అసెంబ్లీ అధ్యక్ష వర్గం ఈ మేరకు ఒక డిక్రీ జారీ చేసింది. ఉభయ కొరియాలు ఏకం కావాలనే లక్ష్యం దిశగా ఇది తొలి అడుగు అని ఉత్తర కొరియా అధికార వార్తా సంస్థ కెసిఎన్‌ఎ పేర్కొంది. శిఖరాగ్ర సదస్సు జరుగుతున్న వేదిక వద్ద రెండు గడియారాలు వేర్వరు సమయాలను సూచిస్తుంటే తనకు చాలా బాధ అనిపించిందని కిమ్‌ పేర్కొన్నారని, అందుకే మొదటగా ఈ నిర్ణయం తీసుకున్నారని కెసిఎన్‌ఎ పేర్కొంది. ఉత్తర కొరియా ఏర్పడినపుడు టోక్యో టైమ్‌కు అనుగుణంగా వుండేలా సమయాన్ని మార్చుకున్నారు.