మెరైన్‌ యూనిట్‌ను ప్రారంభించిన జపాన్‌

మెరైన్‌ యూనిట్‌ను ప్రారంభించిన జపాన్‌

   టోక్యో : రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్‌ శనివారం మొదటి మెరైన్‌ యూనిట్‌ను ప్రారంభించింది. తూర్పు చైనా సముద్రంలోని జపాన్‌ దీవులను ఆక్రమించేవారిని ఎదు ర్కొనేందుకు ఈ యూనిట్‌ను క్రియాశీలం చేసింది. కియుషు దీవిలోని సైనిక స్థావరం వద్ద జరిగిన కార్యక్రమంలో యూని ట్‌కి చెందిన 1500 మంది సభ్యులు పాల్గొన్నారు. జపాన్‌ చుట్టుపక్కల గల రక్షణ, భద్రతా పరిస్థితులను దృష్టిలో వుంచుకుని ఈ చర్య తీసుకున్నట్లు ఉప రక్షణ మంత్రి తొమి హిరో యన్‌ మాటో తెలిపారు. ఒకవేళ దురాక్రమణదారులు దాడికి దిగితే ఎలా స్పందిస్తారో తెలియచేసేలా బలగాలు 20నిముషాల పాటు మాక్‌ ప్రదర్శన నిర్వహించారు.