ఒపెక్‌ నుంచి ఖతార్‌ ఔట్‌..!

ఒపెక్‌ నుంచి ఖతార్‌ ఔట్‌..!

  దోహా : ఒపెక్‌ ( ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ద పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్‌ కంట్రీస్‌) నుంచి వైదొలగనున్నట్టు ఖతార్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జనవరిలో తాము బయటకు వస్తామని గల్ఫ్‌ విద్యుత్‌ శాఖ మంత్రి సాద్‌ షరీదా అల్‌ కాబీ వెల్లడించారు. ఖతార్‌ రాజధానిదోహాలో ఆయన మీడియాతో మాట్లాడారు. 'సహజ వాయు ఉత్పత్తిని 70 మిలియన్‌ టన్నుల నుంచి 110 మిలియన్‌ టన్నులకు పెంచాలని యోచిస్తున్నాం. బహుశా, తామే ఒపెక్‌ బ్లాక్‌ నుంచి వైదొలిగిన తొలి దేశంగా నిలిచిపోతాం. ఒపెక్‌ నుంచి వైదొలగాలని ఇప్పటికిప్పుడే నిర్ణయించుకోలేదు. ఈ అంశంపై కొన్ని నెలలుగా సుదీర్ఘ చర్చలు జరుగుతు న్నాయి. ఈనెల6న ఒపెక్‌ సభ్య దేశాల సదస్సు జరుగనుంది. ఈ సదస్సుకు ముందే మా నిర్ణయం తెలియజేస్తే బాగుంటుందని భావించాం. అందుకే ఈ ప్రకటన చేస్తున్నా' అని సాద్‌ షరీదా అన్నారు.1960లో ఇరాన్‌, ఇరాక్‌, కువైట్‌, సౌదీ అరేబియా, వెనిజులా దేశాలు ఒపెక్‌ను ఏర్పాటు చేశాయి. దీని ప్రధాన కార్యాలయం ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ఉంది. ఒపెక్‌లో ప్రస్తుతం 15 సభ్య దేశాలు న్నాయి. 1961లో ఖతార్‌ ఒపెక్‌లో సభ్య దేశంగా చేరింది. ఎల్‌ఎన్‌జీ (లిక్విఫైడ్‌ నేచురల్‌ గ్యాస్‌) సరఫరా చేస్తున్న దేశాల్లో ఖతార్‌ తొలిస్థానంలో ఉన్నది.