>

పాకిస్తాన్‌లో బోటు ప్రమాదం:15 మంది మృతి

పాకిస్తాన్‌లో బోటు ప్రమాదం:15 మంది మృతి

 ఇస్లామాబాద్‌:  ప‌డ‌వ బోల్తాప‌డిన ఘ‌ట‌న‌లో 15 మంది మృత్యువాత‌ప‌డ్డారు.. ఈ సంఘటన పాకిస్థాన్‌లోని సింధ్‌  రాష్ట్రం తాట్ట జిలాల్లో గురువారం చోటుచేసుకుంది. 50 మంది యాత్రికులతో ఓ బోటు చిన్న దీవికి బయలుదేరుతుండగా బలమైన గాలులు వీయడంతో తిరగబడిందని డిప్యూటీ కమిషనర్‌ మిర్జా నజీర్‌ బేగ్‌ మీడియాకు చెప్పారు. బోటులో సామర్ధ్యానికి మించి ప్రయాణించడం, సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. అలాగే ఈ ఘటనలో ఇప్పటి వరకు 20 మందిని రక్షించినట్లు తెలిపారు. సహాయక  చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. ఈ ఘటనపై సింధ్‌ ముఖ్యమంత్రి సయేద్‌ మురాద్‌ అలీ షా పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు.