పాకిస్తాన్‌లో కూలిన రెండు బొగ్గు గనులు

పాకిస్తాన్‌లో కూలిన రెండు బొగ్గు గనులు

 ఇస్లామాబాద్‌ : పాకిస్థాన్‌లోని నైరుతి బలూచిస్తాన్‌ రాష్ట్రంలో రెండు బొగ్గు గనులు కూలిపోయాయి. ఈ ఘటనలో సుమారు 23 మంది మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు. మరి కొంతమంది గని కార్మికులు చిక్కుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. క్వెట్టాకు సమీపంలోని మార్వార్‌ ప్రాంతంలో శనివారం గ్యాస్‌ పేలుడు కారణంగా ఒక గని కూలిపోగా, సుమారు 25 మంది లోపల చిక్కుకుపోయారు. డిప్యూటీ కమినర్‌ మాటాడుతూ ఈ ఘటనలో 16 మంది మృతి చెందారని తెలిపారు. మరో ఘటన క్వెట్టాకు సమీపంలోని పాకిస్తాన్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ బొగ్గు గనుల్లో జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు.