పాలస్తీనా ప్రధానిపై హత్యాయత్నం

పాలస్తీనా ప్రధానిపై హత్యాయత్నం

  రమల్లా : పాలస్తీనా ప్రధాని రమి హమ్దల్లా గాజాలో తనపై జరిగిన హత్యా ప్రయత్నం నుండి తృటిలో తప్పించు కున్నారు. గాజా స్ట్రిప్‌లో జరగనున్న ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా హమ్దల్లాను కాన్వారుని లక్ష్యంగా చేసుకొని సాయుధులు పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ పేలుడులో ప్రధాని ప్రాణాలతో క్షేమంగా బయటపడగా కాన్వారులోని ఓ వాహనం ధ్వంసమైంది. ఐదుగురుకి స్వల్పగాయాలయ్యాయి. ఇజ్రాయిల్‌ నియంత్రణలోని ఏరేజ్‌ చెక్‌పోస్టును కాన్వారు దాటివెళ్లిన కొద్దిసేపటికే పేలుడు సంభవించినట్లు ఆల్‌ జజీరా వార్తా సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు. ఉత్తర గాజాలో ఉన్న ఈ ప్రాంతాన్ని పాలస్తీ నియన్లు బేయిట్‌ హనౌన్‌గా పిలుస్తారు. దాడి నుంచి తప్పిం చుకున్న అనంతరం ఆయన షెడ్యూలు ప్రకారం హాజర్వా ల్సిన వేడుకకు హాజరయ్యారు. నీటిశుద్ధి క్షేత్రాన్ని ప్రారం భించి ప్రసంగించారు.