ప్రైవేటీకరణను నిరసిస్తున్న రష్యన్‌ కమ్యూనిస్టులు

ప్రైవేటీకరణను నిరసిస్తున్న రష్యన్‌ కమ్యూనిస్టులు

  మాస్కో : దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న ప్రైవేటీకరణ క్రమాన్ని రష్యన్‌ కమ్యూనిస్టులు తీవ్రంగా నిరసిస్తున్నారు. 'బ్లాక్‌ అక్టోబర్‌' 25వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ విషయం ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చింది. 1993లో సోవియట్‌ అనుకూల ప్రజా ప్రదర్శనలపై ఆనాటి రష్యా అధ్యక్షుడు బోరిస్‌ ఎల్‌త్సిన్‌ దాడులు చేయడానికి సంబంధించి 'బ్లాక్‌ అక్టోబర్‌'గా ప్రస్తావిస్తారు. అమెరికా ఆర్థికవేత్తలు సూచించిన 'షాక్‌ థెరపీ'తో రష్యాలో అంతకుముందు సంవత్సరం దేశ జిడిపిలో నాల్గవ వంతు తుడిచిపెట్టుకుపోయింది.