‘రష్యాలో నాకు ఆర్థిక లావాదేవీలు లేవు’

‘రష్యాలో నాకు ఆర్థిక లావాదేవీలు లేవు’

న్యూయార్క్ : రష్యాలో తనకు ఆర్థికపరమైన లావాదేవీలు లేవని అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచాక ట్రంప్ ఇవాళ తొలిసారి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ తాను ఆటోమొబైల్, ఫార్మా రంగాలపై దృష్టిపెడతానని తెలిపారు. ట్రంప్ భారీ సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానన్నారు. ఐసిస్‌పై పోరులో రష్యాతో కలిసి పనిచేస్తామని ట్రంప్ ఉద్ఘాటించారు. పుతిన్ తనను ఇష్టపడితే అది మంచి పరిణామమని అభిప్రాయపడ్డారు. తన పన్ను రిటర్నులను విడుదల చేయనని ట్రంప్ స్పష్టం చేశాడు.