సవాళ్ల బాటలో థెరిస్సా మే

సవాళ్ల బాటలో థెరిస్సా మే

  లండన్‌ : బ్రెగ్జిట్‌ ఒప్పందంపై బ్రిటన్‌ వైఖరి పట్ల ఇయుకి అసహనం పెరుగుతుండడం, గురువారం నాడు నాటో సదస్సు జరగనున్న నేపథ్యంలో బ్రిటన్‌ ప్రధాని థెరిస్సా మే దేశీయంగా పలు సవాళ్లను ఎదుర్కొంటు న్నారు. అంతర్జాతీయంగా అవమానాలను ఎదుర్కొనాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం నాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ బ్రిటన్‌లో పర్యటిస్తు న్నారు. ఈ సందర్భంగా ట్రంప్‌కు నిరసనల సెగ తగిలే అవకాశాలు వున్నాయి. తనకు తెలిసినంత వరకు బ్రిటన్‌ రాజకీయాల్లో ఇంతటి అనిశ్చితి ఎన్నడూ చూడలేదని లండన్‌ మాజీ మేయర్‌ కెన్‌ లివింగ్‌స్టోన్‌ ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.