శ్రీలంక అధ్యక్షుడు సంచలన నిర్ణయం

శ్రీలంక అధ్యక్షుడు సంచలన నిర్ణయం

  కొలంబో: శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన గురువారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ దేశ ప్రధాని రణిల్ విక్రమసింఘే ఆధ్వర్యంలో ఉన్న శాంత్రి భద్రతల మంత్రిత్వశాఖను తొల‌గించి మరొకరికి కేటాయించారు. దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని విధించినప్పటికీ తాజాగా మరోసారి మెజారిటీ సింహళ బౌద్ధులు, మైనారిటీ ముస్లింల మధ్య హింసాకాండ జరగడంతో ఆయన నిర్ణయం తీసుకున్నారు. యునైటెడ్ నేషనల్ పార్టీ(యూఎన్‌పీ)కి చెందిన సీనియర్ నేత రంజిత్ మద్దుమ బండారను శాంత్రి భద్రతల మంత్రిగా గురువారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. ముస్లింలకు చెందిన వ్యాపారాలు, మతపరమైన సంస్థలు అధిక సంఖ్యలో ఉన్న సింహళుల దాడిలో ధ్వంసంకావడంతో ప్రభుత్వం కర్ఫ్యూ విధించడానికి కారణమయ్యాయి. అల్లర్లు దేశంలోని మిగతా ప్రాంతాలకు వ్యాపించడకుండా ఇంటర్నెట్ సేవలను కూడానిలిపివేసింది. దీంతో పాటు సోషల్ మీడియా వెబ్‌సైట్లలో హింసను ప్రేరింపించే వ్యాఖ్యలు చేయరాదని హెచ్చరించింది. మెసేజింగ్ యాప్‌లు వాట్సాప్‌తో పలు ఇంటర్నెట్ సేవలను అల్లర్లు జరుగుతున్న ప్రాంతాల్లో బ్లాక్ చేసింది. రెండు వర్గాల మధ్య హింస చెలరేగడంతో అధ్యక్షడు మైత్రిపాల సిరిసేన మంగళవారం ఎమర్జెన్సీ ప్రకటించి.. పోలీస్ బలగాలను మోహ‌రించారు.