స్థానిక ఎన్నికలను బహిష్కరించిన పిడిపి

స్థానిక ఎన్నికలను బహిష్కరించిన పిడిపి

   శ్రీనగర్‌ : జమ్మూ కాశ్మీర్‌లో వచ్చే నెలలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ (పిడిపి) ప్రకటించింది. ఆ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సోమవారం నాడిక్కడ పత్రికా గోష్టిలో ఈ సంగతి వెల్లడించారు. ఆర్టికల్‌ 35ఎను రద్దు చేయాలన్న మోడీ సర్కార్‌ యొచనపై జమ్మూ కాశ్మీర్‌ ప్రజలు తీవ్ర ఆందోళనతో ఉన్నారని, కేంద్రం తన యోనచ విరమించుకోవాలని అమె కోరారు. జమ్మూ కాశ్మీర్‌లో మరో ప్రధాన పార్టీ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌సి) ఈ స్థానిక ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటిం చింది. ఆర్టికల్‌35ఎపై వేటు వేయాలన్న యోచనను మోడీ ప్రభుత్వం వెనక్కి తీసు కోకుంటే 2019 పార్లమెంటు ఎన్నికలను కూడా బహిష్కరించాల్సి వస్తుందని ఆ పార్టీ హెచ్చరించింది. 

పిడిపి కూడా అదే మార్గం ఎంచుకుంది. ఆర్టికల్‌ 35ఎకు సంబంధించిన కేసు సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉండగా పంచాయితీ ఎన్నికలు నిర్వహించడంలో అర్థం లేదని పిడిపి నేత పేర్కొన్నారు. ఆర్టికల్‌ 35ఎ కోసం జమ్మూ కాశ్మీర్‌ ప్రజలు చాలా త్యాగం చేశారని, ఇప్పుడు ఆ నిబంధన చెల్లుబా టును ప్రశ్నించడం రాష్ట్రానికి రాజ్యాంగం కల్పించిన ప్రతిపపత్తిపై దాడి చేయడమే నని పిడిపి నేత పేర్కొన్నారు. రాష్ట్రంలో మున్సిపాలిటీ, పంచాయితీ ఎన్నికలు నిర్వ హించాలన్న నిర్ణయంపై కేంద్రం పునారాలోచించుచకోవాలని ఆమె కోరారు. 35ఎ ఆర్టికల్‌ జోలికి వస్తే ఊరుకునేది లేదని బిజెపికి, ప్రధాని నరేంద్ర మోడీకిఇ తాను ఇది వరకే హెచ్చరించానని ఆమె తెలిపారు.

బిజెపి కార్యకర్తలు కూడా లోయలో ఎన్నికలు నిర్వహించడానికి ఇది సరైన సమయం కాదని భావిస్తున్నట్లు ప్రతినిధుల సమాచారం. ఆర్టికల్‌ 35ఎ చెల్లుబాటును సవాల్‌ చేస్తూ దాఖలైన పంచాయితీ, మునిసిపల్‌ ఎన్నికలు షెడ్యూల్‌ ప్రకారం అక్టోబర్‌ ఒకటి నుండి ప్రారంభం కాను న్నాయి. మునిసిపల్‌ ఎన్నికలు నాలుగు దశల్లో అక్టోబర్‌ 1 నుండి 5 వరకు జరగను న్నాయి. పంచాయితీ ఎన్నికలు ఎనిమిది దశల్లో నవంబర్‌ 8 నుండి డిసెం బర్‌ 4 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. కాగా, దక్షిణ కాశ్మీర్‌లో ఉన్న అన నుకూల పరిస్థితుల దృష్ట్యా కార్యకర్తల ఒత్తిడి మేరకు మూడు పార్టీలు నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పిడిపి, కాంగ్రెస్‌లు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించినట్లు తెలుస్తోంది.