స్వదేశానికి చేరిన ఉత్తరకొరియా ప్రతినిధి బృందం

స్వదేశానికి చేరిన ఉత్తరకొరియా ప్రతినిధి బృందం

 ప్యాంగాంగ్‌ : మూడు రోజుల దక్షిణ కొరియా పర్యటన ముగించుకుని డెమో క్రటిక్‌ పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా (డిపిఆర్‌కె) ఉన్నత స్థాయి ప్రతినిధివర్గం ఆదివారం రాత్రి స్వదేశానికి తిరిగి వచ్చింది. ప్రైవేట్‌ జెట్‌లో బయలు దేరిన ఈ ప్రతినిధి బృందానికి దక్షిణ కొరియా ఏకీకరణ మంత్రి చో మియాంగ్‌ వీడ్కోలు పలికారు. దక్షిణ కొరియాలోని ప్యాంగ్‌ చాంగ్‌లో జరిగిని 23వ వింటర్‌ ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉత్తర కొరియా నుండి ఈ ప్రతి నిధి బృందం హాజరైంది. పర్యటనలో రెండోరోజు దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జే ఇన్‌తో విందు సమావేశం జరిపారు.