తరలివెళ్తున్న వెనిజులా దేశస్థులు

తరలివెళ్తున్న వెనిజులా దేశస్థులు

  బొగటా: వెనిజులా దేశస్థులు వేల సంఖ్యలో కొలంబియా దేశానికి తరలి వెళ్తున్నారు. బోర్డర్‌ను పూర్తిగా మూసివేస్తామని కొలంబియా దేశాధ్యక్షుడు జువాన్ మాన్యువల్ సాంటోస్ ప్రకటన చేయడంతో వెనిజులా దేశస్థులు భారీగా కదిలారు. ప్రత్యేక బోర్డర్ కార్డ్ లేదా పోస్‌పోర్ట్ ఉంటేనే వెనిజులా దేశస్థుల్ని అనుమతి ఇస్తామని కొలంబియా స్పష్టం చేసింది. దీంతో వెనిజులా దేశస్థులు గందరగోళ పరిస్థితిలో కొలంబియా దిశగా వెళ్తున్నారు. వాస్తవానికి ప్రతి రోజూ వేలాది మంది వెనిజులియన్లు... ఉద్యోగం కోసం కొలంబియా వెళ్తుంటారు. నిత్యావసరాలు కొనేందుకు కూడా ఆ దేశానికి వెళ్తారు. చాలా వరకు జనం మళ్లీ తిరిగి స్వదేశానికి వస్తారు. 

అయితే ఇటీవల వెనిజులాలో ఆర్థిక పరిస్థితి క్షీణించింది. ఆ దేశం తీవ్ర సంక్షోభానికి వెళ్లింది. నిత్యావసరాలు, మెడిసిన్స్ అక్కడ దొరకడం లేదు. ఈ నేపథ్యంలో బోర్డర్‌ను మూసివేయాలని కొలంబియా భావిస్తున్నది. వెనిజులియన్లు వలస వెళ్తున్న తీరు పట్ల కూడా బ్రెజిల్ ఆందోళన వ్యక్తం చేసింది. చాలా దుర్భరమైన పరిస్థితుల్లో వెనిజులియన్లు జీవిస్తున్నట్లు బ్రెజిల్ అభిప్రాయపడింది. మరోవైపు వెనిజులా.. ఏప్రిల్ 22వ తేదీన దేశాధ్యక్ష ఎన్నికలను నిర్వహించనున్నది. ఆ దేశాధ్యక్షుడు నికోలస్ మాడురో రెండవ సారి పోటీలో నిలవనున్నారు. అమెరికా వెన్నుపోటు వల్లే తమ దేశం ఆర్థిక సంక్షోభం తలెత్తినట్లు మాడురో ఆరోపించారు.