థెరిస్సా మే పై హత్యాయత్నం కుట్ర భగ్నం 

థెరిస్సా మే పై హత్యాయత్నం కుట్ర భగ్నం 

 లండన్‌ : బ్రిటన్‌ ప్రధాని థెరెస్సా మేను హత్య చేసేందుకు కొందరు పన్నిన కుట్రను భగ్నం చేసినట్లు బ్రిటన్‌ నిఘా తెలిపింది. ప్రధాని నివసించే 10 డౌనింగ్‌ స్ట్రీట్‌ నివాస భవనంలో అత్యంత శక్తివంతమైన పేలుడు పదార్ధాన్ని ప్రయోగించటం ద్వారా ఈ హత్యకు కుట్ర పన్నారని పోలీసులు భావిస్తున్నారు. గత కొద్ది వారాలుగా స్కాట్లండ్‌ యార్డ్‌, మిడ్‌లాండ్‌ పోలీసులతో కలిసి పని చేసిన ఎంఐ5 అధికారులు ఈ కుట్రను ఛేదించినట్లు సమాచారం. అంతకు ముందు ప్రధాని థెరెస్సా మే ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ గత ఏడాది కాలంలో బ్రిటన్‌కు వ్యతిరేకంగా 9 కుట్రలు జరిగాయని చెప్పారు.