ట్రంప్‌ ప్రసంగాన్ని వాయిదా వేసుకోమన్న పెలోసీ

ట్రంప్‌ ప్రసంగాన్ని వాయిదా వేసుకోమన్న పెలోసీ

 వాషింగ్టన్‌ : సరిహద్దు గోడ కోసం లక్షలాది మంది ఉద్యోగుల ఉసురు తీస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ నెల 29న అమెరికన్‌ కాంగ్రెస్‌లో చేయాల్సి వున్న వార్షిక ప్రసంగాన్ని వాయిదా వేసుకోవాలని ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సి పెలోసి ఆయనకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ షట్‌డౌన్‌ ఇంకా కొనసాగుతుందడం వల్ల భద్రతా పరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశముందని ఆమె అన్నారు. తాను, ట్రంప్‌ కలసి మాట్లాడుకుని కొత్త తేదీని నిర్ణయిస్తామని ఆమె చెప్పారు. ట్రంప్‌ తన ప్రసంగాన్ని వాయిదా వేసుకునేందుకు అంగీకరించని పక్షంలో దానిని లిఖిత పూర్వకంగా సమర్పించ వచ్చని పెలోసి సూచించారు. హోమ్‌లాండ్‌ సెక్యూరిటీ మంత్రి కిర్‌స్టీన్‌ నీల్సన్‌ మాత్రం అధ్యక్షుని యూనియన్‌ ఆఫ్‌ స్టేట్‌ ప్రసంగానికి తాము అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.