>

యునెస్కోకు అమెరికా గుడ్‌బై!

యునెస్కోకు అమెరికా గుడ్‌బై!

 వాషింగ్టన్: అమెరికా కఠిన నిర్ణయం తీసుకున్నది. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) నుంచి తప్పుకోవాలని నిర్ణయించింది. ఈ సంస్థ అనుసరిస్తున్న ఇజ్రాయెల్ వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అగ్రదేశ అధికారులు వెల్లడించారు. 2011లో పాలస్తీనియన్ అథారిటీకి యునెస్కోలో స్థానం కల్పించినప్పటి నుంచీ ఈ సంస్థకు నిధుల పంపిణీని అమెరికా నిలిపి వేసింది. అయితే పారిస్‌లో ఉన్న యునెస్కో హెడ్‌క్వార్టర్స్‌లో మాత్రం తమ కార్యాలయాన్ని కొనసాగిస్తూ వస్తున్నది. యునెస్కో కొత్త డైరెక్టర్ కోసం ఓటింగ్ వెళ్తున్న సమయంలో అమెరికా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కొంతకాలంగా యునెస్కో తీసుకుంటున్న యాంటీ ఇజ్రాయెల్ విధానాలపై యూఎన్‌కు అమెరికా అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న నిక్కీ హేలీతోపాటు పలువురు సీనియర్ అధికారులు విమర్శిస్తూనే ఉన్నారు.