వచ్చేవారం కొలువు దీరనున్న పాక్‌ కొత్త పార్లమెంట్‌

వచ్చేవారం కొలువు దీరనున్న పాక్‌ కొత్త పార్లమెంట్‌

  ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌లో నూతనంగా ఎన్నికైన పాక్‌ నూతన పార్లమెంట్‌ను వచ్చేవారంలో సమావేశ పరచాలని ఆపద్ధర్మ ప్రభుత్వం పాక్‌ అధ్యక్షుడు మమ్నూన్‌ హుస్సేన్‌కు నివేదిక సమర్పించింది. ఈనెల 12, 14 తేదీల మధ్య జాతీయ అసెంబ్లీ సమావేశమవు తుందన్న పాక్‌ న్యాయ, సమాచార మంత్రి అలీ జఫర్‌.. కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రమాణ స్వీకారం చేస్తారని వెల్లడిం చారు. స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌లను ఆ రోజే ఎన్నుకుంటారని అలీ తెలిపారు. నిబంధనల ప్రకారం పాకిస్తాన్‌ జాతీయ అసెంబ్లీని ఆగస్టు 15తేదీలోపు సమావేశపరచాల్సి ఉంది. పాక్‌ సార్వత్రిక ఎన్నికల ఫలి తాలపై ఈసీ మంగళవారం నోటీసులు విడుదల చేసిన నేపథ్యంలో జాతీయ అసెంబ్లీని సమావేశపరిచేందుకు మార్గం సుగమమైంది.