>

విక‌టించిన ఇఫ్తార్ విందు.. 900 మందికి అస్వ‌స్థ‌త‌

విక‌టించిన ఇఫ్తార్ విందు.. 900 మందికి అస్వ‌స్థ‌త‌

 మోసుల్: ఇరాక్‌లో రంజాన్ మాసం సంద‌ర్భంగా ఇచ్చిన ఇఫ్తార్‌ విందు విక‌టించింది. ఆహారం తిన్న సుమారు 900 మంది తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. మోసుల్ న‌గ‌రంలో ఉన్న క్యాంపులో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. బ్రిటీష్ ఎన్జీవో ఆ ఆహారాన్ని స‌ర‌ఫ‌రా చేసిన‌ట్లు తెలుస్తున్న‌ది. అస్వ‌స్థ‌త‌కు గురైన‌వారిలో చిన్నారులు, మ‌హిళ‌లు, పురుషులు ఉన్నారు. ఆహారం తిన్న క్యాంపు జ‌నం తీవ్ర రీతిలో వాంతులు, విరోచ‌నాలు చేసుకున్నారు. ఇఫ్తార్ విందు విక‌టిండం వ‌ల్ల డిహైడ్రేష‌న్‌కు గుర‌య్యారు. హ‌స‌న్‌ష్యామ్ యూ2 క్యాంపులో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. మోసుల్‌, ఇబ్రిల్ న‌గ‌రాల మ‌ధ్య ఈ క్యాంపును ఏర్పాటు చేశారు. ప్ర‌స్తుతం ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర‌వాదులు, భ‌ద్ర‌తా ద‌ళాల మ‌ధ్య మోసుల్‌లో తీవ్ర యుద్ధం సాగుతున్న‌ది. 800 కేసులు రిజిస్ట‌ర్ అయిన‌ట్లు అధికారులు చెప్పారు. అందులో 200 మంది మ‌హిళ‌లు ఉన్నారు. 


Loading...